దేవుడా ఏంటీ ఘోరం: ఎగ్ పఫ్ డబ్బాల్లో ఎలుకలు తిరుగుతున్నాయి..!

దేవుడా ఏంటీ ఘోరం: ఎగ్ పఫ్ డబ్బాల్లో ఎలుకలు తిరుగుతున్నాయి..!

సరదాగా అలా బయటికి వెళ్లినప్పుడుగానీ..లేదా ప్రయాణాల్లో గానీ మనం తరుచుగా రైల్వే స్టేషన్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో దొరికే ఫుడ్ ను తింటుంటాం. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటలతో అలాంటి ప్రాంతాల్లో ఫుడ్ తినాలంటేనే జంకుతున్నారు ప్రజలు..స్ట్రీట్ ఫుడ్, హోటళ్లు, రెస్టారెంట్లు, రైల్వే కేటరింగ్ సర్వీస్ లలో బొద్దింకలు, ఇనుప్ మొలలు వస్తున్నట్లు సంఘటన జరుగుతున్నాయి. అంతేకాదు.. చాలా కాలం నిల్వ ఉంచిన ఫుడ్స్ కూడా గుర్తు పట్టకుండా వేడి చేసి పెడుతున్న సంఘటనలు జరిగాయి. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు సోషల్ మీడియాలో చాలా సంఘటన చాలా చూశాం. తాజాగా కోల్ కతాలో కూడా ఇటువంటిదే ఓ సంఘటన జరిగింది. చికెన్ పఫ్ తిందామని హౌరా రైల్వే స్టేషన్ లోని ఓ  ఫుడ్ స్టాల్ కు వెళ్లిన  ప్రయాణికుడికి ఎదురైన పరిస్థితి చూసి షాక్ తిన్నాడు.. తేరుకున్న ఆ వ్యక్తి సోషల్ మీడియాలో తనకు ఎదురైన అనుభవాన్ని పోస్ట్ షేర్ చేసి పంచుకున్నాడు.. వివరాల్లోకి వెళితే.. 

ఈ పోస్ట్ షేర్ చేసిన వ్యక్తి.. హౌరా రైల్వే స్టేషన్ ఓ ఫుడ్ స్టాల్ వెళ్లి చికెన్ పఫ్ తిందామని వెళ్లాడు. తనకు ఇష్టమైన చికెన్  పఫ్ ఉందని .. ఎంతో ఆత్రుతగా తిందామని వెళ్లిన అతనికి అక్కడి దృశ్యం చూసి అతనికి వాంతి వచ్చినట్టయింది.తనకు ఎదురైన ఆ వింత పరిస్థితిని రెడ్డిట్ లో షేర్ చేశారు. 
ఇంతకీ ఎగ్ పఫ్ పెట్టెలో ఏముందీ..? చికెన్ పఫ్ లు నిల్వ ఉంచి పెట్టెలో ఎలుకలు తిరుగుతున్నాయి. అది చూసిన కస్టమర్.. యాక్ మని వామ్ టింగ్ చేసుకున్నాడు..ఇలాంటి ఫుడ్ ని ఎలా తింటారు.. అంటూ హౌరా స్టేషన్ లో తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను  నెటిజన్లతో పంచుకున్నాడు. చికెన్ పఫ్ ల మధ్య పెద్ద ఎలుక తిరుగుతున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అక్కడి ఉన్న సిబ్బందికి తెలియజేసినా.. వారు పట్టించుకోలేదు..నిర్లక్ష్యంగా ప్రవర్తించారు అని రాశాడు. 

ఈ పోస్ట్ లోని వీడియోని చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇటువంటి ఫుడ్ స్టాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. నువ్వు ఫిర్యాదు చేయాల్సింది.. ఇలాంటి జరిగితే వదిలిపెట్టకూడదన ఓ నెటిజన్ హెచ్చరించాడు. ప్యాక్ చేసిన ఆహారం తప్పా రైల్వే స్టేషన్లలో దొరికే విడి ఫుడ్ అంత మంచిది కాదు..ఎప్పుడూ అలాంటి ఫుడ్ తినకూడదని సలహా ఇచ్చారు కొందరు.